వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మిసిమి పత్రిక భాగస్వామ్య సమావేశం, జూలై 2018
On 24 July 2018, CIS-A2K team held partnership discussions with Misimi Telugu monthly magazine.
Full details on Wikipedia page here
వికీపీడియా నుండి < వికీపీడియా:సమావేశం | హైదరాబాదు Jump to navigation Jump to search
2018 జూలై 24న మిసిమి కార్యాలయ గ్రంథాలయంలో తెలుగు వికీపీడియా అభివృద్ధి కోసం భాగస్వామ్య అవకాశాలను గురించి జరిపిన చర్చల సారాంశం.
వివరాలు
- తేదీ-సమయం: 2018 జూలై 24న మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకూ
- ప్రదేశం: మిసిమి కార్యాలయ గ్రంథాలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద, ముషీరాబాద్, హైదరాబాద్
పాల్గొన్న వ్యక్తులు
- వల్లభనేని అశ్వినీ కుమార్, సంపాదకుడు, మిసిమి పత్రిక
- కాండ్రేగుల నాగేశ్వరరావు, సహ సంపాదకుడు, మిసిమి పత్రిక
- పవన్ సంతోష్, సీఐఎస్-ఎ2కె.
చర్చించిన అంశాలు
- హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న మిసిమి కార్యాలయ గ్రంథాలయంలో మన నెలవారీ సమావేశాలు నిర్వహించుకోవచ్చనీ, అక్కడే పుస్తకాలు తీసుకుని చదివి సమాచారం అభివృద్ధి చేసేలాంటి ఎడిటథాన్లు నిర్వహించుకోవచ్చని వారు అవకాశం ఇచ్చారు.
- వచ్చే నెల అటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటే పత్రిక రచయితలను ఆహ్వానిస్తానని పేర్కొన్నారు. తెలుగు వికీపీడియాలో అభివృద్ధి చేయదలిచిన కొన్ని ప్రధానమైన అంశాలు (తెలుగు ప్రముఖులు, తెలుగు గ్రామాలు, భారతదేశ చరిత్ర, వగైరా) తీసుకుని తెవికీపీడియన్లు, మిసిమి రచయితలూ కలిసి ఆయా అంశాల్లో అత్యంత ప్రామాణికమని ఎంచే పుస్తకాలను (ఓ 50-100) జాబితా వేస్తే ఆ జాబితా భవిష్యత్తులో మనం తెలుగు వికీపీడియన్లకు అందుబాటులోకి తీసుకురావడం, వికీసోర్సు పునర్విడుదలలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి కార్యక్రమాలకు స్వీకరించేందుకు వీలుంటుంది.
- మిసిమి పత్రికలో తెలుగు వికీపీడియా నిర్మాణం, అది ఎదుర్కొంటున్న సమస్యలు, సభ్యులు దాన్ని అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాలు వంటి అంశాలను కలిపి తెవికీపీడియన్లు వ్యాసం రాయవచ్చు, తద్వారా అత్యంత సీరియస్, పాండిత్య, పరిశోధన ప్రధానమైన మిసిమి పత్రికను చదివే పాఠకులకు తెవికీపీడియా గురించి విజ్ఞప్తి చేసినట్టవుతుంది.
- పత్రికను కేవలం లాభాపేక్ష కోసం కాక ఉన్నతమైన లక్ష్యాల కోసం నడుపుతున్నట్టు కాబట్టి కాపీహక్కుల మీద తమకు పట్టింపులేదనీ, పత్రికలోని నాణ్యమైన సాహిత్యం ప్రజలకు చేరువ కావడం ముఖ్యమనీ వారు తెలిపారు. పత్రికలోని పలు వ్యాసాలను కానీ, సంచికలను కానీ ప్రస్తుతం పత్రికల కాపీహక్కుల పునర్విడుదల విషయమై ఉన్న సాంకేతిక సమస్యలు అధిగమించి ఎలా సీసీ-బై-ఎస్‌ఎలోకి తీసుకురావచ్చన్నది ఆలోచించాలి.